సాధారణంగా స్టార్ హీరోల కొడుకులు తమ వారసత్వాన్ని నిలబెట్టేందుకు సినీ రంగంవైపే ప్రోత్సహిస్తుంటారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, సాండల్ వుడ్, మాలీవుడ్ లలో స్టార్ హీరోల కొడుకులు, కూతుళ్లు సినిమా ఇండస్ట్రీ వైపే వచ్చారు. నటన సరిగా రాకపోయినా.. ఇండస్ట్రీలో స్థిరపడిన వారిని చాాలా మందినే మనం చూశాం.
కానీ మాధవన్ మాత్రం అందుకు భిన్నంగా తన కొడుకు వేదాంత్ ను వేరే రంగం వైపు ప్రోత్సహిస్తున్నాడు. మాధవన్ కొడుకు వేదాంత్ నేషనల్ లెవల్ స్విమ్మింగ్ ఛాంపియన్. మహారాష్ట్రలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో 7 మెడల్స్ ను గెలిచాడు. భారత్ తరుపున వేదాంత్ 2026 ఒలంపిక్స్ లో ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. అయితే కొడుకు కెరీర్ కోసం కష్టపడుతున్నాడు మాధవన్. కోవిడ్ ఆంక్షల కారణంగా ఇండియాలో ఒలింపిక్స్ స్థాయి స్విమ్మింగ్ ఫూల్స్ అందుబాటులో లేవు. దీంతో కొడుకును శిక్షణ నిమిత్తం మాధవన్, భార్య సరితలతో కలిసి దుబాయ్ తీసుకెళ్లాడు.
కోవిడ్ ఆంక్షల వల్ల ముంబైలో పెద్ద స్విమ్మింగ్ ఫూల్స్ అందుబాటులో లేవు. దుబాయ్ లో ఒలింపిక్స్ స్థాయిలో స్విమ్మింగ్ ఫూల్స్ అందుబాటులో ఉండటంతో ఇక్కడికి వచ్చామని మాధవన్ తెలిపాడు. తన కొడుకుకి సినిమారంగంపై ఆసక్తి లేదు. అందుకే తను ఇష్టపడిన రంగంలో ప్రోత్సహిస్తున్నాం అని చెబుతన్నాడు. తన కొడుకు స్మిమ్మింగ్ లో ప్రపంచ ఛాంపియన్ షిప్ పతకాలు గెలుస్తున్నాడని.. మేము గర్వపడేలా చేస్తున్నాడని చెబుతున్నాడు మాధవన్.