జాతీయ జెండాను తొక్కిన టీడీపీ ఎమ్మెల్యే.. రోజా షాకింగ్ ట్వీట్

-

కూటమి ప్రభుత్వానికి చెందిన వినుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు కూడా పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. జాతీయ జెండా వేసిన.. ముగ్గు పైనుంచి నడుచుకుంటూ వచ్చారు వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. దీనిపై వైసీపీ పార్టీ సీరియస్ అవుతోంది.

roja
roja tweet on Vinukonda TDP MLA G.V. Anjaneyulu over national flag

జాతీయ జెండాను అవమానించిన జీవి ఆంజనేయులుపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై వినుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు స్పందించారు. దేశ ప్రజలకు క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై మండిపడ్డారు మాజీ మంత్రి రోజా. శత్రువులు కూడా ఇలా చేయరు అంటూ ట్వీట్ చేశారు. ఇదేనా మీ దేశభక్తి చంద్రబాబు, లోకేష్..? అంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news