ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో ఓ వృద్ధురాలు తన ఇంట్లో ఉన్న కోడి వద్దకు అది పెట్టిన గుడ్లను సేకరించేందుకు వెళ్లింది. అయితే ఆ కోడి ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది.
వృద్ధురాలిని చంపిన కోడి.. ఏంటీ హెడింగ్ చదివి షాక్‌కు గురవుతున్నారా..? అవును, షాక్ కలిగించినా ఇది నిజమే. ఆ కోడి ఓ వృద్ధురాలిని చంపిది. ఇంతకీ ఈ ఘటన జరిగింది ఎక్కడో తెలుసా..? ఆస్ట్రేలియాలో..! ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో ఓ వృద్ధురాలు తన ఇంట్లో ఉన్న కోడి వద్దకు అది పెట్టిన గుడ్లను సేకరించేందుకు వెళ్లింది. అయితే ఆ కోడి ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. తన ముక్కుతో ఆ వృద్ధురాలిని పొడిచింది. దీంతో ఆమె రక్తనాళాలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రక్తస్రావం జరిగి భారీగా రక్తం పోయింది. ఈ క్రమంలో ఆ వృద్ధురాలని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
అయితే ఆస్ట్రేలియాలో ఇలా పెంపుడు జంతువుల వల్ల వ్యక్తులు మరణించిన ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయట. అది కూడా వృద్దులే ఎక్కువగా ఇలాంటి సంఘటనల్లో మృతి చెందుతున్నారట. తాజాగా ఓ వృద్ధురాలు తన పెంపుడు పిల్లి తన కాలి గోళ్లతో రక్కడం వల్ల పైన చెప్పిన విధంగానే తీవ్ర రక్తస్రావమైన మృతి చెందింది. ఈ క్రమంలోనే పెంపుడు జంతువులను పెంచుకునే వారు వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అడిలైడ్ యూనివర్సిటీకి చెందిన ఫోరెన్సిక్స్ నిపుణుడు రోగర్ బయార్డ్ మాట్లాడుతూ.. పెంపుడు జంతువుల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. వాటికి ఉండే పదునైన గోర్లు, ముక్కు కారణంగా అవి దాడి చేస్తే రక్తస్రావం జరిగి చనిపోయేందుకు అవకాశం ఉంటుందని, ముఖ్యంగా వాటి పట్ల వృద్ధులు ఇంకా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అయితే ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగని విధంగా ఆస్ట్రేలియాలోనే ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతుండడం నిజంగానే పలువురు నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది..!