బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఇబ్బందులు లేకుండా, ట్రాపిక్ కష్టాలు లేకుండా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. సభకు మొత్తం 5 జోన్లు.. 5 మార్గాలు.. 5 పార్కింగ్ ప్రదేశాలను గుర్తించారు. 3 జాతీయ రహదారులు సభాస్థలికి అందుబాటులో ఉంచారు.పార్కింగ్ చేసిన దగ్గర నుండి 200-300 మీటర్ల నడకతోనే సభ ప్రాంగణంలోకి వెళ్ళేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.
జోన్ 1 – వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, ములుగు, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లందు.
జోన్ 1 రూట్ – మల్లంపల్లి నుండి వంగపహాడ్ దాటి NH 163లో U టర్న్ తీసుకుని హసన్‌పర్తి మీదుగా సభ పార్కింగ్
జోన్ 2 – పాత నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల నియోజకవర్గాలు &
ఇల్లందు( కొంత భాగం), వైరా, ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర.
జోన్ 2 రూట్ – ఖమ్మం వారి కోసం మామునూరు నుండి NH 163 టోల్‌గేట్ దాటి అనంతసాగర్ మీదుగా సభ పార్కింగ్.
ఉమ్మడి జిల్లాల వారికి కరుణాపురం నుండి NH 163 టోల్‌గేట్ దాటి సభ పార్కింగ్.
జోన్ 3 – జనగాం, స్టేషన్ ఘనపూర్ నుంచి సభ పార్కింగ్.
జోన్ 3 రూట్ – ధర్మసాగర్ నుండి సభ పార్కింగ్.
జోన్ 4 – పాత కరీంనగర్ జిల్లా నియోజకవర్గాలు, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, పరకాల(కొంత భాగం).
జోన్ 4 రూట్ – కరీంనగర్, హుజూరాబాద్ నుండి గ్రానైట్ రోడ్డు మీదుగా పార్కింగ్.
జోన్ 5 – పాత మెదక్, నిజామాబాద్ జిల్లాల నియోజకవర్గాలు, నిర్మల్, ఆదిలాబాద్, ఖానాపూర్, బోత్.
జోన్ 5 రూట్ – సిద్దిపేట మీదుగా ముల్కనూర్ నుండి ఇందిరానగర్ పార్కింగ్‌లను సిద్ధంచేశారు.