రాష్ట్రవ్యాప్తంగా సైదాబాద్ ఘటన సంచలనంగా మారింది. సింగరేణి కాలనీకి చెందిన ఆభం శుభం తెలియని ఆరేండ్ల చిన్నారిపై పాశవికంగా అత్యాచారం చేసి.. హతమార్చిన నరరూప రాక్షసుడు పల్లకొండ రాజు కోసం రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చర్యలు చేస్తున్నారు పోలీసులు. హైవేలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు అని తేడా లేకుండా అన్ని చోట్ల పోలీసులు మూమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పోలీసు శాఖ.. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి పది లక్షల రూపాయల బహుమతిని ఓ సంచలన ప్రకటన చేసింది.
ఇదిలాఉంటే.. మరోవైపు ఈ ఘటనపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆ కామాంధుడని పట్టుకోవడంలో పోలీసులకు సహకరిద్దామంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. తొలుత హీరో మంచు మనోజ్ బాధిత కుటుంబాన్ని కలిసి , పరామర్శించారు. నిందితుడి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దారుణంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. ఈ ఘటనలు జరగడం బాధకరమని, నిందితుడి కఠినంగా శిక్షించాలని విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై న్యాచులర్ స్టార్ నాని కూడా విచారం వ్యక్తం చేశారు. నిందితుడు బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదంటూ ట్వీట్ చేశారు.
తాజాగా ఈ ఘటనపై ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కూడా తనదైన శైలిలో స్పందించారు. ఆ చిట్టితల్లి కి న్యాయం జరగాలంటే, ఆ చిన్నారి ఆత్మ శాంతించాలంటే.. నిందితుడు దొరకాలి . హైద్రాబాద్ సిటీ పోలీస్ విడుదల చేసిన ఈ ఆధారాల ద్వారా ఈ నిందితుడిని పట్టుకున్న వారికి 10 లక్షలు రివార్డ్ ప్రకటించారు. తన వంతుగా నిందితుడిని పట్టించిన వారికి రూ.50 వేలు ఇస్తాననీ, నిందితుడు దొరకాలని.. వాడి చేతిపై ‘మౌనిక’ అనే పచ్చబొట్టు ఉంటుంది. ఆ పచ్చబొట్టే తప్పకుండా వాడిని పట్టించేలా చేస్తుందని.. వాడు మీ దగ్గర్లోనే ఉండొచ్చు.. ఒక కన్ను వేసి ఉంచండి. ఆ మానవ మృగాన్ని పట్టుకునే ప్రయత్నంలో మన వంతు సాయం అందిద్దామంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు ఆర్ పి పట్నాయక్.