#NBK107 : బాలయ్య సినిమా టైటిల్ బిగ్ అప్డేట్

-

అఖండ సినిమాతో బిజీ గా ఉన్న బాలకృష్ణ… క్రాక్‌ డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. క్రాక్‌ హిట్‌ తో ఊపు మీదున్న గోపీచంద్‌ మలినేని బాలకృష్ణ లాంగ్వేజ్‌ కు సరిపడే కథాంశం తో ఈ సినిమా ను తీయనున్నారు. మైత్రీ మూవీస్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.

అయితే… ఈ సినిమా టైటిల్‌ గురించి.. గత వారం రోజుల నుంచి సోషల్‌ మీడియా లో తెగ చర్చ జరుగుతోంది. బాలకృష్ణ మరియు గోపీచంద్‌ మూవీ కి రౌడీయిజం అనే పేరు ఖరారు చేసినట్లు.. దీనిని త్వరలోనే ప్రకటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే… దీనిపై మైత్రీ మూవీస్‌ సంస్థ స్పందించింది. ఈ మూవీ కి రౌడీయిజం అనే పేరు ఖరారు కానట్లు… స్పష్టం చేసింది మైత్రీ మూవీస్‌ సంస్థ. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది. రూమర్లను ఎవరూ నమ్మకండని… త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ ను ప్రకటిస్తామని కుండబద్దలు కొట్టింది.

 

Read more RELATED
Recommended to you

Latest news