సీఎం గారు..మీ సమీప బంధువులైనా చర్యలు తీసుకోవాలి !

-

ఏపీ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న రఘురామ కృష్ణం రాజు మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి ఏరియల్ సర్వే లో ఆవ భూములు ముంపునకు గురవుతున్నాయని సీఎం గ్రహించి ఉంటారని ఆ భూముల దొంగలు మీ సమీప బంధువులైనా సరే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని అన్నారు. సుప్రీం కోర్టులో మూడు రాజధానులు కేసు ఈరోజు మరోసారి వాయిదా పడిందని, హైకోర్టులో ఓ వారంలో తేలే విషయానికి పదేపదే సుప్రీంకోర్టుకు రావడం ద్వారా ప్రజాధనం వృధా అవుతుందని అన్నారు.

రైతులు కూడా కోర్టుల్లో పోరాడేందుకు వారి కష్టార్జితం పణంగా పెట్టాల్సి వస్తుందని, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ ఉపసంహరించుకుంటే మంచిదని అన్నారు. ఏపీలో మరోసారి ఇసుక పాలసీ ని మారుస్తున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపిన ఆయన గత సంవత్సర కాలంగా ఇసుక అందక ఇబ్బంది పడుతున్న వారికి ఇది శుభవార్తేనని అన్నారు. నా ఫోన్ టాపింగ్ కి పాల్పడినవారిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేశానని ఆయన అన్నారు. దానిపై ఖచ్చితంగా వివరాలు బయటపడతాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్రం పరిధిలోకి రాదని అధికార బిజేపి జాతీయ అధికార ప్రతినిధి చెప్పడం అసంబద్ధంగా ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version