అగ్రరాజ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు.. ప్రీమియర్స్‌ వసూళ్లలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా..

-

‘ఆర్ఆర్ఆర్’ చిత్ర మేనియా ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ నడుస్తోంది. ఈ ఫిల్మ్‌ను చూసేందుకు సినీ లవర్స్‌తో పాటు సెలబ్రిటీలు పోటీ పడుతున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో ఇప్పటికే చాలా మంది చూసేశారు. ఈ సంగతులు పక్కనబెడితే అగ్రరాజ్యం అమెరికాలో సినిమా ప్రీమియర్ షోలు చూసేందుకు వేల మంది వచ్చేశారు. అలా అమెరికాలోనూ బొమ్మ దద్దరిల్లిపోయింది. గురువారం నుంచి ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లు రికార్డు క్రియేట్ చేశాయి. అలా వసూళ్ల పరంగా రికార్డు క్రియేట్ చేసిన తొలి చిత్రంగా ‘ ఆర్ఆర్ఆర్’ నిలవడం విశేషం.

అమెరికాలో ఉన్న అభిమానులు వేల రూపాయలు పెట్టి మరీ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు చూస్తుండటం విశేషం. అగ్రరాజ్యంలో సినిమా విడుదలైన 981 చోట్ల గురువారం రాత్రి వరకు 30,00,127 డాలర్లు అనగా ఇండియన్ మనీలో సుమారు రూ.22.85 కోట్లు వసూళ్లను రాబట్టింది. అలా కేవలం ప్రీమియర్ షోల ద్వారానే మూడు మిలియన్ డాలర్లు రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ ట్రెండ్ సెట్ చేసింది. ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ సరిగమ సినిమాస్ వారు ట్వి్ట్టర్ వేదికగా ఈ లెక్కలను వెల్లడించారు. ఈ మేరకు వారు ట్వీట్ చేశారు.

ఇక ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర వసూళ్లు తొలి రోజే వంద కోట్ల రూపాయలు దాటొచ్చని పలువురు సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ పిక్చర్ చూసేందుకు అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు.
ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటినీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తిరగరాస్తుందని ఈ సందర్భంగా సినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వచ్చిన ఈ ఫిల్మ్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే కొత్త పోకడలకు బీజం వేస్తుందని, ఇక మున్ముందు మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగే అవకాశాలుంటాయని పలువురు అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version