ఆర్ఆర్ఆర్: బయ్యర్లకు భయం పుట్టిస్తున్న ట్రిపుల్ ఆర్

-

దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ‘ ఆర్ఆర్ఆర్’ కోసం ఎదురుచూస్తున్నారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సినిమా విడుదల కాబోతోంది. బాహుబలి తరువాత రాజమౌళి తీస్తున్న మల్టీ స్టారర్ సినిమా కావడంతో.. తారక్, చరణ్ కాంబినేషన్ లో వస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. సౌత్ తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ భాషలతో పాటు హిందీలో విడుదల కాబోతోంది ఈ ప్యాన్ ఇండియా సినిమా. 

ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ మాత్రం కొందరిని భయపెడుతోంది. ‘ మీకేమైనా టాక్ తెలిసిందా..? సినిమా సూపర్ అంటున్నారు నిజమేనా..? దిల్ రాజు సినిమా చూశారట కదా.. అంటూ ప్రశ్నిస్తున్నారు బయ్యర్లు. ప్రస్తుతం సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లలో సినిమా ఏవిధంగా ఉండబోతోందనే గుబులు పుట్టింది. కోట్లకుకోట్లు పెట్టి సినిమాను కొనుగోలు చేస్తుండటంతో సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనే భయం పట్టుకుంది. సినిమా కోసం పెద్ద మొత్తాలకు కమిట్ అయ్యారు. ఇన్నేళ్లు అడ్వాన్స్ లు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లు.. ఇక ఫైనల్ ఎమౌంట్ కట్టే సమయం వచ్చింది. 

భారీ బడ్జెట్ సినిమా కావడం.. సినిమాపై చాాలా హైప్ ఉండటంతో నిర్మాత దానయ్య ఒక్క పర్సంట్ కూడా తగ్గేది లేదంటూ… ఖరాఖండీగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే కిందన ఉండే ఎగ్జిబిటర్లు కూడా పెద్దగా అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో థియేటర్ల నుంచే సినిమాకు కట్టాల్సిన మొత్తాలు వచ్చేవి కానీ… ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బయ్యర్లు తమ ఇళ్ల నుంచి డబ్బు తెచ్చి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఆంధ్రలో పెద్ద సంఖ్యలో థియేటర్లు ఉన్న ఓ ఎగ్జిబిటర్ తమ థియేటర్లలో సినిమా వేస్తే వేసుకోండి లేకపోతే లేదని… అడ్వాన్స్ లు ఇచ్చేది లేదని స్పష్టం చేశాడు. కావాలంటే ఓ 50 లక్షలు మాత్రమే ఇస్తానని అన్నారు. మూడు కోట్లు వస్తాయనుకున్న బయ్యర్లు ఈ ఫిగర్ ను చూసి తెగ గాబరా పడిపోతున్నారు.

ఇదిలా ఉంటే భారీ అంచానాలతో వచ్చిన ‘ భీమ్లానాయక్’ అనుకున్న విజయం సాధించలేదు. ఇక ప్యాన్ ఇండియా సినిమాగా వచ్చిన ‘ రాధేశ్యాం’ డిజాస్టర్ గా మిగిలింది. ఈరెండు సినిమాల దెబ్బకు బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ట్రిపుల్ ఆర్ పై అనుమానంగా చూస్తున్నారు. పైగా దిల్ రాజు చూసారు. ముంబాయిలో షో వేసారు ఇలాంటి వార్తలు అన్నింటినీ అనుమానంగా చూస్తున్నారు. కావాలని పుట్టిస్తున్నారా? నిజమేనా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version