యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్

-

టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. ప్రముఖ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ నిన్న విడుద‌ల అయిన విష‌యం తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ ప్ర‌స్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. అరుదైన రికార్డు ను కొల్ల‌గోడుతూ సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తుంది. అయితే ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ విడుద‌ల అయిన ఏడు గంట‌ల లో నే టాలీవుడ్ లో ఎక్కువ లైక్స్ వ‌చ్చిన ట్రైల‌ర్ గా నిలిచింది.

కేవ‌లం ఏడు గంట‌ల లో నే 1 మిలియన్ పైగా లైక్స్ తో దూసుకుపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ తెలుగు ట్రైల‌ర్ కూడా ఇంత వేగం గా 1 మిలియ‌న్ లైక్స్ ను సొంతం చేసుకోలేదు. అలాగే వ్యూస్ ప‌రం గా కూడా 20 మిలియ‌న్ ల మార్క్ ను అందుకోవ‌డానికి సిద్ధం గా ఉంది. అయితే సినీ ఇండస్ట్రీ లో ప్ర‌ముఖులు గా ఉన్న రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, రాజ‌మౌళి కాంబినేష‌న్ లో సినిమా రావ‌డం తో నే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఈ ట్రైల‌ర్ తో ఈ అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version