మరో అవార్డు కైవసం చేసుకున్న RRR.. తగ్గేదేలే.. !

-

రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం ఆర్.ఆర్.ఆర్ గత ఏడాది రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కేవలం పాన్ ఇండియా సినిమాగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అన్ని భాషలలో కూడా విడుదలై మరింత పాపులారిటీ దక్కించుకోవడమే కాకుండా అవార్డు మీద అవార్డు కైవసం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఆస్కార్ అవార్డు టార్గెట్ గా రూపొందించిన ఈ సినిమా పలు రకాల అవార్డులను సొంతం చేసుకుంటూ ఉండడం గమనార్హం.

ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కింద నాటు నాటు పాటకు ఎమ్. ఎమ్. కీరవాణికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించగా.. ఇప్పుడు మరొక అవార్డు కూడా లభించింది. ఈ చిత్రానికి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు కూడా లభించిందట. ఈ విషయాన్ని స్వయంగా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు వారు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ అవార్డ్ ను రాజమౌళి స్వీకరించారు. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ చిత్రంగా ఈ సినిమా ఇప్పుడు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక రాజమౌళి అవార్డ్స్ తో చీర్స్ కొడుతూ ట్విట్టర్ వేదికగా ఈ విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం అవార్డును అందుకున్న సంతోషంలో రాజమౌళి కూడా తేలిపోతున్నారు.

ఇప్పటికే ఆస్కార్ నామినేషన్ లో కూడా చోటు దక్కించుకున్న ఈ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవాలని అభిమానులు మాత్రమే కాదు పలువురు ప్రముఖులు కూడా ఆశిస్తున్నారు. శ్రియ, అజయ్ దేవగన్, అలియా భట్, ఒలీవియా మోరిస్ తదితరులు ఈ సినిమాలో నటించినందుకుగాను వీరందరికీ కూడా మంచి గుర్తింపు లభించింది. దీంతో ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి చిత్రం యూనిట్ ధన్యవాదాలు కూడా తెలియజేసింది. మొత్తానికైతే క్రిటిక్ ఛాయిస్ అవార్డు సొంతం చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ట్విట్టర్ పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో పలువురు నెటిజెన్స్ , సినీ ప్రేమికులు, సెలబ్రిటీలకు కూడా ఆర్ఆర్ఆర్ టీంకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version