హెచ్‌సీయూలో రూ.10వేల కోట్ల స్కామ్.. ఎంపవర్డ్ కమిటీ అదే తేల్చింది : కేటీఆర్

-

ఇటీవల రేవంత్ రెడ్డి సర్కారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో రూ.10 వేల కోట్ల స్కామ్ చేసిందని తాను చెప్పింది నిజమే అని ఎంపవర్డ్ కమిటీ సైతం తేల్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ.. ‘HCU భూములపై రూ.10వేల కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల కింద చెప్పా..

నిన్న సీఈసీ HCU భూములపై ఆర్థిక పరమైన అవకతవకలు, ఉద్దేశపూర్వకంగా చేసిన అరాచక పర్వంపై స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఇండిపెండెంట్ ఇన్విస్టిగేషన్ టీంను ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చింది. రూ.10 వేల కోట్ల కుంభకోణం బయటకు రావాలంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆర్బీఐ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ సందర్భంగా ప్రధాని మోడీని కూడా డిమాండ్ చేస్తున్నా.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కాంగ్రెస్ సర్కారు చేసిన దుర్మార్గాలు, కుంభకోణాలపై చర్యలు తీసుకునే చిత్తశుద్ధి ఉంటే ఎంపవర్డ్ కమిటీ చెప్పినట్టుగా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ చేయించండి. సీబీఐ, ఆర్బీఐ, సీవీసీ, సుప్రీం జడ్జి.. ఎవరితో ఇన్వెస్టిగేషన్ చేయిస్తారో మీ ఇష్టం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news