రూ.2 లక్షల రుణమాఫీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

-

తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. గతేడాది డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కాబట్టి.. ముందే చెప్పినట్లు డిసెంబర్ 9న రుణమాఫీ అమలవుతుందేమో అని రైతులు భావించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకూ అమలుకాలేదు.

అయితే తాజాగా రూ.2లక్షల రైతు రుణమాఫీపై విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలి అని తెలిపారు. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలి. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా చూడాలి. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాలి’ అని రుణమాఫీ, వ్యవసాయ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news