కంగన్ రనాథ్ పై చెంప దెబ్బ… స్పందించిన పంజాబ్ సీఎం

-

బాలీవుడ్‌ సీనియర్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ చెంప దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే . అయితే ఈ ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ స్పందించారు.

పంజాబ్‌ రైతుల పోరాటంపై కంగన చేసిన వ్యాఖ్యల వల్లే ఆమెను కానిస్టేబుల్‌ కొట్టిందని తెలిపారు. అది కోపం. కంగన గతంలో మాట్లాడిన మాటలే కానిస్టేబుల్‌ను ఆగ్రహానికి గురి చేశాయి ఆయన అని అన్నారు. ఇది జరగకుండా ఉండాల్సింది. ఆమె అలా మాట్లాడటం తప్పు అని ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ మీడియాతో చెప్పారు.కాగా, జూన్‌6వ తేదీన కంగన రనౌత్ చండీగఢ్‌ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెక్‌కు వెళ్లినపుడు అక్కడున్న సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ ఆమెను చెంపపై కొట్టింది. రైతుల పోరాటంలో తన తల్లి పాల్గొందని, ఆ పోరాటాన్ని కంగన కించపరిచినందుకే కొట్టానని ఆమె పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news