ఏపీకి కేంద్రం శుభవార్త.. స్మార్ట్ పోలీసింగ్ కింద రూ.43 కోట్లు విడుదల

-

“స్మార్ట్‌ పోలీసింగ్‌” కింద ఏపీకి రూ. 43 కోట్ల నిధులు విడుదల చేసింది. పోలీసు వ్యవస్థలో సమూలమైన సంస్కరణలు తీసుకురావడానికి ప్రవేశపెట్టిన “స్మార్ట్‌ పోలీసింగ్‌” విధానం కింద 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్‌కు 43 కోట్ల 68 లక్షల రూపాయల నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌. రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌.

2014 నవంబర్‌లో జరిగిన డీజీపీ, ఐజీ 49వ వార్షిక సమావేశంలో పోలీసు వ్యవస్థలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ప్రధానమంత్రి “స్మార్ట్‌ పోలీసింగ్‌” విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారని తెలిపారు. శిక్షణ ద్వారా పోలీసుల సామర్ధ్యం పెంపు, అధునాతన టెక్నాలజీ వినియోగం, ప్రజల విశ్వాసం చూరగొనడం, పోలీసింగ్‌లో అధునాతన, వినూత్న పద్దతులను ప్రవేశపెట్టడం, సైంటిఫిక్‌ పరికరాలు, అప్లికేషన్ల ద్వారా విచారణను పక్కాగా నిర్వహించడం వంటి అంశాలు “స్మార్ట్‌ పోలీసింగ్‌”లో భాగమని మంత్రి తెలిపారు. పోలీసు వ్యవస్థను ఆధునీకరించే అంశంలో ఆయా రాష్ట్రాలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది… సంస్కరణల అజెండా లక్ష్యాలను ఆయా రాష్ట్రాలు ఏ విధంగా అందుకుంటున్నాయో పరిశీలించి ప్రోత్సాహకాల కింద వాటికి నిధులను విడుదల చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version