ఆంబులెన్స్ లో ఆరు కిలోమీటర్లకు రూ.9,200 ఛార్జ్..?

-

కోల్​కతాలోని ఓ ప్రాంతంలో తొమ్మిది నెలలు, తొమ్మిదన్నరేళ్ల వయసున్న ఇద్దరు సోదరులు అనారోగ్యంతో ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఛైల్డ్​ హెల్త్​(ఐఐసీ హెచ్)లో చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారివురికీ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వారిని అంబులెన్స్​ ద్వారా ప్రభుత్వాస్పత్రిలో తరలించే ప్రయత్నం చేశాడా తండ్రి.ఐసీహెచ్​ నుంచి స్థానిక మెడికల్​ కాలేజీ ఆస్పత్రికి వెళ్లేందుకు అంబులెన్స్​ డ్రైవర్.. రూ.9,200 ​భారీ మొత్తాన్ని ఇవ్వాలని కోరినట్లు ఆ తండ్రి చెప్పాడు. అంత సొమ్ము తాను ఇచ్చుకోలేనని వేడుకొన్నా.. డ్రైవర్​ పట్టించుకోలేదన్నాడు.

ambulance

ఇంతలో.. అంబులెన్స్​లో ఉన్న తన చిన్న కూమారుడికి ఆక్సిజన్​ తీసేసి, తన భార్యను బలవంతగా వాహనం నుంచి దింపారని కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే… అక్కడి వైద్యులు కలగజేసుకొని తనకు మద్దతు పలికారని బాధితుడు తెలిపారు. ఆ వైద్యుల కారణంగానే తన కుమారులకు ఇప్పుడు కేఎంసీహెచ్​లో మెరుగైన చికిత్స అందుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.వైద్యులు జోక్యం చేసుకొని సర్దిచెప్పగా.. రూ. 2,000లకు తగ్గాడు అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version