కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగుతోంది. విపక్ష పార్టీలు, వైద్య నిపుణులతోపాటు సుప్రీం కోర్టు కూడా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కానీ ప్రధాని మోదీ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అయితే దేశంలో కోవిడ్ పరిస్థితులు అదుపు తప్పాయని, పరిస్థితి చేయి దాటిందని ఆర్ఎస్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
దేశంలో కరోనా రోజు రోజుకీ తీవ్రరూపం దాలుస్తుందని, మరోవైపు వైద్య సదుపాయాలు, వైద్య సిబ్బంది కొరత ఏర్పడిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు ఆర్ఎస్ఎస్ నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. దీంతో బీజేపీ నేతలు ఇరుకున్న పడినట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ నేతలు, బీజేపీ నేతల మధ్య కోవిడ్ విషయంపై విభేదాలు వచ్చినట్లు సమాచారం.
దేశంలో కోవిడ్ పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతుండడంపై ఆర్ఎస్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులు తీవ్రరూపం దాలుస్తున్నా కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పలు ఆంగ్ల మీడియా చానళ్లలోనూ ఈ విషయంపై కథనాలు వచ్చాయి. అయితే బీజేపీ ఈ విషయంలో ఏమని స్పందిస్తుందో చూడాలి.