ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో పరిస్థితి కాస్త ఆందోళన కలిగిస్తుంది. కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వాలు లాక్ డౌన్ కూడా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అక్కడ ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గంగానదిలో ఒక 150 మృతదేహాలు తేలుతూ వచ్చాయని అధికారులు వెల్లడించారు. దీనిపై అక్కడి స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేసారు.
గత 7 రోజులు నుండి తేలుతున్నట్లు సమాచారం అందింది అని అధికారులు చెప్పుకొచ్చారు. మృతదేహాలను దహనం చేయడానికి అన్నీ ఏర్పాట్లు చేశాము అని బక్సర్ ఎస్.డి.ఓ కె కె ఉపాధ్యాయ మీడియాకు వివరించారు. ఉత్తరప్రదేశ్ లో మరణించిన కరోనా మృతదేహాలను ఈ విధంగా పడేస్తున్నారు అని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కాస్త అక్కడి ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉంది.