బ్రేకింగ్: సంపూర్ణేశ్ బాబు కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

-

టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఉదయం సిద్ధిపేట సమీపంలో సంపూర్ణేశ్, తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, కొత్త బస్టాండ్ వద్ద ఓ ఆర్టీసీ బస్సు అతని కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారంతా గాయపడ్డారు.

సంపూర్ణేశ్ ముఖానికి, చేతులకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఆయన భార్య, కుమార్తె కూడా గాయపడ్డారు. వీరిని చూసి స్పందించిన స్థానికులు, సమీపంలోని ఆసుపత్రికి తరలించడంలో సాయపడ్డారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సివుంది.

Read more RELATED
Recommended to you

Latest news