ఏపీలోని దేవాదాయ శాఖ కమిషనరేట్ లో ఉద్యోగులకు వింత ఆదేశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల దుస్తులపై అధికారులు ఆంక్షలు విధించడం చర్చనీయాంశం అయ్యింది. గళ్ళ చొక్కా లతో కార్యాలయానికి రావద్దని ఉద్యోగులకు కమిషనర్ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా లేతరంగు వస్త్రాలతోనే కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.
ఎవరైనా గళ్ళ రంగు చొక్కాలు వేసుకొని వస్తే వారికి తామే దుస్తులు కొనిస్తానని అధికారులు చెబుతున్నారట. ప్యాంట్లు కాకుండా పంచెలు కట్టుకొని వస్తే మరింత మంచిదని అధికారులు చెబుతున్నారట. దాంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మల్ దుస్తులు అంటే సరే కానీ గల్ల చొక్కలపై చొక్కాల రంగులపై ఆంక్షలు విధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు అసహనం వ్యక్తం చేయడం తో అధికారులు వెనక్కి తగ్గుతారా లేదా అన్నది ఆసక్తికరం గా మారింది.