ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ బ్రెయిన్ డెడ్… ఇది అమెరికా మీడియా. అబ్బే అదేం లేదు.. అంతా బాగానే ఉంది అలజడి ఏమీ లేదు. బాబు చక్కగా పాంగ్యాంగ్ లో అత్యంత సన్నిహితులతో ఎంజాయ్ చేస్తున్నాడు. దక్షిణ కొరియా మీడియా. కాదు కాదు అతనికి వరుస సర్జరీలు జరుగుతున్నాయి. మళ్ళీ అమెరికా మీడియా. అసలు అతని గురించి మీకు ఎందుకు అంటుంది చైనా మీడియా. అంతా బాగానే ఉంది, బాబు బాగానే ఉన్నాడు అని చెప్తుంది.
సరే.. పొరుగుదేశ అధినేత మీద అంత ప్రేమ ఆప్యాయతలు చూపించే దక్షిణ కొరియా దేశం.. అతను బయట కనపడట౦ లేదు అంటుంది. అసలు ఎక్కడ ఉన్నాడో తెలియదు అని చెప్తుంది. ప్రతీ రెండు రోజులకు ఒకసారి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేసి ఇంట్లోకి వెళ్లిపోతు ఉంటాడు ఆయన. మరి ఆ చేతులు ఊపిన సన్నివేశం ఈ మధ్య కాలంలో అసలు ఎక్కడా లేదు. ఆయన చేతులు ఊపేసి 23 రోజులు దాటింది.
ఈ నెల 11 న చివరి సారి కేబినేట్ సమావేశంలో తన చెల్లికి ఏదో బాధ్యత అప్పగించిన సమయంలో కనిపించారు అంతే. తాను ప్రత్యక్ష దైవంగా భావించే తన తాత జన్మదిన వేడుకలకు కూడా అతను హాజరు కాలేదు. ఆయన ఎక్కడ ఉన్నా ఎం చేసినా సరే ఆ రోజు వేడుకల్లో పాల్గొనడం, కొరియా సరిహద్దుల్లో ఆయన సైనిక కవాతులో గౌరవ వందనం స్వీకరించడం వంటివి జరుగుతూ ఉంటాయి. కాని అది జరగలేదు.
అంతర్జాతీయ మీడియా ఇన్ని కథనాలు రాస్తున్నా, ఇంత హడావుడి చేస్తున్నా, చివరికి అతని చావుని పరోక్షంగా కోరుకునే అమెరికా కథనాలు రాస్తున్నా… ఆయన మాత్రం కనపడటం లేదు. సరే చనిపోలేదు, సర్జరీ జరిగింది, లేదు ఆయన బిజీ గా ఉన్నాడు. దీని గురించి ఇంత హడావుడి గా ఉన్నప్పుడు ఒక్క మాట ఉత్తరకొరియా చెప్తే ఏం పోతుంది. ఇంత మందిలో కంగారు ఉండదు, ఆయన్ను అభిమానించే అభిమానులు కొరియా వార్తలు చదవరు.
ఆయనకు అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. భారీ ఖాయం ఆయనది. ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పుడు ఏదోక వార్త వస్తూనే ఉంటుంది. ఆయన చనిపోతే మనకు ఏం వస్తుంది గాని, ఏదోక విషయం చెప్పొచ్చు కదా అని అంటున్నాం. చైనా ఏమో వైద్యులను పంపింది అంటున్నారు. 36 ఏళ్ళు కూడా నిండని ఆయనకు ఈ కష్టాలు ఏంటీ అని ఆయన అభిమానుల ఆవేదన. ఒకవేళ చనిపోతే, అమెరికాకు భయపడి చెప్పడం లేదని అంటున్నారు మరి.