ఇటీవల ఐసీసీ క్రికెట్ లో పలు నిబంధనలు మార్చుతు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిబంధనలు మార్చిన దానిలో మన్కడింగ్ కూడా ఉంది. మన్కడింగ్ పై ఐసీసీ స్పష్టమైన నిబంధనలు ప్రకటించింది. దీంతో క్రికెట్ ప్రపంచం మొత్తం.. మన్కడింగ్ గురించి మాట్లాడుకుటుంది. అయితే ఐసీసీ తాజా గా నిబంధనల ప్రకారం.. మన్కడింగ్ చేయడంలో బౌలర్ తప్పులేదని ఐసీసీ తెల్చి చెప్పింది. నాన్ స్ట్రైకర్ క్రీజ్ దాటితే.. బ్యాటర్ తప్పేనని ఐసీసీ స్పష్టం చేసింది.
దీంతో మన్కడింగ్ స్పెషలిస్ట్ గా పేరు ఉన్నా.. రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బౌలర్లు అందరూ మన్కడింగ్ చేయాలని పిలుపు నిచ్చారు. బౌలర్లు మన్కడింగ్ చేయకుంటే… భారీ మూల్యం చెల్లించక తప్పదని సూచించాడు. అలాగే కేరీర్ కూడా నాశనం అవుతుందని అన్నారు. అలాగే ఐసీసీకి మన్కడింగ్ లో కీలక మార్పులు చేసినందకు కృతజ్ఞతలు కూడా తెలిపారు.
కాగ గతంలో అశ్విన్ పంజాబ్ జట్టులో ఆడిన సమయంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు చెందిన బట్లర్ ను మన్కడింగ్ చేసి అవుట్ చేశాడు. అప్పుట్లో అది తీవ్ర వివాదం జరిగింది. కాగ ఇప్పుడు మన్కడింగ్ జరిగితే రనౌట్ అని ఐసీసీ ప్రకటించింది. కాగ ప్రస్తుతం అశ్విన్ రాజస్థాన్ రాయల్స్ వైపే ఆడుతున్నాడు.