మోడీకి పుతిన్ ఫోన్, ఎందుకు…?

-

ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా మోడీకి ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఫోన్ చేసారు. పుతిన్ ఫోన్ చేయడంపై మోడీ హర్షం వ్యక్తం చేసారు. భారత్ మరియు రష్యా మధ్య ప్రత్యేక మరియు ప్రతిష్టాత్మక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరువురు నాయకులు చర్చలు జరిపారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ ద్వైపాక్షిక చర్చలు, కార్యక్రమాలు జరిగినందుకు ఇరువురు హర్షం వ్యక్తం చేసారు.

ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ ఇటీవల మాస్కోకు వెళ్లడంపై ఇద్దరు అధినేతలు చర్చించారు. ఈ ఏడాది ఎస్సీఓ, బ్రిక్స్ చైర్మన్ గా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎంపిక కావడంపై మోడీ అభినందనలు తెలిపారు. ఈ ఏడాది చివర్లో జరగబోయే ఈ సదస్సులలో పాల్గొనడానికి ఆత్రుతగా ఉన్నాను అని మోడీ చెప్పారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి తన కోరికను మోడీ… పుతిన్ కు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version