ukraine crisis: రష్యాపై యూరోపియన్ యూనియన్ మరిన్ని ఆంక్షలు

-

ఉక్రెయిన్ ప  దాడి మొదలై 45 రోజులకు చేరింది. ఉక్రెయిన్ పై రష్యా భీకరదాడులు చేస్తోంది. ఇప్పటికే రాజధాని కీవ్ తో సహా ఖార్కీవ్, సుమీ, మరియోపోల్ వంటి నగరాలను మసిదిబ్బలుగా మార్చింది. తాజాగా కీవ్ నుంచి రష్యా బలగాలు ఉపసంహరించుకున్నా… తూర్పు ప్రాంతంపై విరుచుకుపడుతోంది. నిన్న ఉక్రెయిన్ లో పౌరులను తరలిస్తున్న ఓ రైల్వే స్టేషన్ పై రెండు రాకెట్లతో దాడి చేసింది. ఈ ఘటనలో మొత్తం 30 వరకు పౌరులు చనిపోయారు. మరోవైపు బూచా నగరంలో రష్యా సాగించిన హత్యాకాండపై ప్రపంచం అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికాతో పాటు యూరోయిన్ దేశాలు, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా ఆర్థిక ఆంక్షలు విధించినా.. రష్యా ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే రష్యా నుంచి ఎగుమతి అవుతున్న వస్తువులపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. 

తాజాగా యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యా నుంచి ఎగుమతి అవుతున్న బొగ్గుపై ఆంక్షలు విధించింది. బూచా, మరియోపోల్ నగరాల్లో అమాయక పౌరులపై రష్యా దాడి చేయడంపై యూరోయిన్ యూనియన్ దేశాలు భేటీ అయ్యాయి. విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలకు అత్యంత కీలకమైన బొగ్గు దిగుమతులను నిలిపేసేందుకు సిద్ధం అయింది. యూరప్ దేశాలకు రష్యా నుంచి బొగ్గు రవాణా నిలిచిపోతే రష్యాకు ఏడాదికి రూ. 33,423 కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version