రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి చేరుస్తోంది భారత ప్రభుత్వం. ఆపరేషన్ గంగ లో భాగంగా ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నారు. తాజాగా ఈరోజు మరో రెండు విమానాలు రోమేనియా, హంగేరీ లను నుంచి బయలుదేరాయి. దీంతో ఇప్పటి వరకు 9 విమానాల్లో భారతీయును ఇండియాకు తరలించారు. ఇప్పటి వరకు 1396 మందిని ఇండియాకు తరలించారు.
తాజాగా ఈరోజు రోమేనియా బుకారెస్ట్ నుంచి 218 మందితో, హంగేరీ బుడాపెస్ట్ నుంచి 216 మందితో, ఇదే విధంగా బుకారెస్ట్ నుంచి మరో విమానం ద్వారా 182 మంది భారతీయులతో స్వదేశానికి బయలుదేరాయి. ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లో భారతీయుల తరలింపును పరిశీలించేందుకు ప్రత్యేెక దూతులుగా కేంద్రమంత్రులు వెళ్లారు. ప్రధాన మంత్రి ప్రత్యేక దూతలుగా కేంద్ర మంత్రులు హర్దీప్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు మరియు జనరల్ (రిటైర్డ్) VK సింగ్‌లను కేంద్ర ప్రభుత్వం ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపింది. హర్దీప్ పూరీ హంగేరీకి, రొమేనియా మరియు మోల్డోవాలో తరలింపు ప్రక్రియను సింధియా పర్యవేక్షిస్తారని, కిరణ్ రిజిజు స్లోవేకియాకు, జనరల్ (రిటైర్డ్) వికె సింగ్ పోలాండ్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
#RussiaUkraineConflict | The ninth #OperationGanga flight with 218 Indian nationals departs from Bucharest (Romania) for New Delhi: EAM Dr. S. Jaishankar pic.twitter.com/cEfhhJb8AQ
— ANI (@ANI) March 1, 2022