ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన రష్యన్ బలగాలు.. చివరకు రాజధానిని స్వాధీనం చేసుకున్నాయి. ఈరోజు ఉదయం కీవ్ కు 30 కిలోమీటర్ల దూరంలో మోహరించిన రష్యన్ ఆర్మీ వేగంగా.. కీవ్ లోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ కు సంబంధించిన స్నేక్ ఐలాండ్ ను రష్యన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. కీవ్ నగరంలోని అధికారిక భవనాలపై రష్యా జెండాను ఎగరేశారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోకి రష్యన్ బలగాలు ప్రవేశించినట్లుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలన్ స్కీ వెల్లడించారు. మరో 96 గంటల్లో కీవ్ ను పూర్తిగా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. నన్ను.. నాకుటుంబాన్ని చంపడమే రష్యా టార్గెట్ గా పెట్టుకుందని ఆయన అన్నారు. ఇప్పటికే చెర్నోబిల్ ను రష్యన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సహాయం చేస్తుమన్న నాటో కూటమి తమకు సహాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.