భీమ్లా నాయక్ బాక్సాఫీసు వద్ద హిట్
మామూలు హిట్ కాదు ఎవ్వరూ ఊహించనంత
ఎవ్వరి అంచనాలు అయినా తారుమారు చేసేంత
దటీజ్ పవన్.. ఆత్మ గౌరవం గెలిచింది పవన్ గెలిచాడు
ఆ విధంగా ప్రభుత్వ పెద్దలు పునరాలోచనలో పడ్డారు
అంతా మంచికే! అన్నీ మంచికే!
పవన్ ఏమనుకుంటే అదే చేస్తారు. తనకున్న బలం బలగం అభిమాన గణం వాటిపైనే నమ్మకాలు ఉంచారు.తాను అనుకున్న ప్రకారం సినిమా బడ్జెట్ ను ఎక్కడా పెంచలేదు. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా హైప్ చేయలేదు. సినిమా బాగుంటే చూడండి ఎప్పటిలానే నన్ను దీవించండి అన్నది మాత్రం ఆయన తరఫు విన్నపం. ఇక ఆయన ఎప్పటి నుంచో ప్రభుత్వ అనుచిత పెత్తనంపై, పెద్దల అహంపై పోరాడుతున్నారని జనసైనికులు అంటున్న మాట. ఇదే మాట మొన్నటి వేళ పవన్ కూడా అన్నారు. కనుక పవన్ ఆత్మ గౌరవం కాపాడేందుకు అభిమానులు ఉన్నారు. వారే ఈ సినిమాకు అదనపు బలం మరియు బలగం. ప్రభుత్వం అహం ఓడించేందుకు రేపటి వేళ ఓటర్లు తప్పక ఉంటారు అన్నది జనసేన మాట.
ఇప్పటిదాకా ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్న వాదనలోనే ఉండిపోతున్నాం. ఆత్మ గౌరవం గెలిస్తే ఒకవిధంగా అహంకారం గెలిస్తే మరోవిధంగా అనుకుని సర్దుకుపోతున్నాం. ఈ క్రమంలో ఏపీ సర్కారు తనదైన శైలిలోనో నడవడిలోనే భాగంగా కొత్త జీఓ అయితే ఇవ్వలేదు. ఆ విధంగా ఏపీ సర్కారు అహంకారం ఓ విధంగా నెగ్గిందనే చెప్పాలి. కానీ ఇదే సమయంలో పవన్ తనదైన ఆత్మవిశ్వాసం నమ్మకాన్నీ వీడక తనవంతు ప్రయత్నంగా సినిమాను విడుదల చేశారు. ఓవర్సీస్ లో సినిమాకు మంచి టాక్ ఉంది. ఇక తెలంగాణ, ఆంధ్రా అన్న తేడా లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలనూ అలరిస్తోంది.
ఇక చాలా రోజుల నుంచి జగన్ తో పవన్ విభేదం పెట్టుకుంటూనే ఉన్నారు. రాజకీయ పరంగా సైద్ధాంతిక పంగా అనేక విభేదాలు ఇరువర్గాలలో ఉన్నాయి.ఇలాంటి సందర్భంలో పవన్ తనదైన ఆత్మ గౌరవాన్ని చాటుకునేందుకే ఎక్కువగా ప్రయత్నించారు. సినిమా టిక్కెట్ల ధరల విషయమై ఇండస్ట్రీ లో విభిన్న అభిప్రాయాలు ఉన్నా పవన్ మాత్రం ఏపీ సర్కారుతో చర్చలు జరిపేందుకు ఇష్టపడలేదు. సైద్ధాంతిక విభేదాలను దృష్టిలో ఉంచుకుని తన పని తాను చేసుకుని వెళ్లారు.ఆ విధంగా తనకున్న అభిమాన గణం తన సినిమా నచ్చితే చూస్తారు లేదంటే లేదు అన్న భావనతోనే ఉన్నారు. సో ఏ విధంగా చూసుకున్నా ఆత్మ గౌరవమే గెలిచింది.అహంకారం ఆయనను గెలిపించింది.