రష్యా- ఉక్రెయిన్ వార్: రష్యాకు ఎదురుదెబ్బ… ఉక్రెయిన్ దాడిలో 14 వేల మంది రష్యన్ సైనికుల హతం

-

ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ ప్రారంభం అయి 25 రోజులు అవుతోంది. ఇంకా ఎన్ని రోజులు యుద్ధం జరుగుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు రెండు దేశాలు బెలారస్ వేదికగా నాలుగు సార్లు చర్చలు జరిపినా.. కొలిక్కి రాలేదు. ఇదిలా ఉంటే రెండు మూడు రోజుల్లోనే రష్యాకు లొంగిపోతుంది అని అంతా అనుకున్నప్పటికీ.. ఉక్రెయిన్ అద్భుత పోరాట పటిమ చూపిస్తోంది. రష్యా సేనలను ముప్పుతిప్పలు పెడుతోంది. ఉక్రెయిన్ సేనల దెబ్బకు రష్యా తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటికే రష్యాకు సంబంధించి 14700 సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ట్విట్ చేసింది. రష్యాకు సంబంధించి 96 యుద్ధవిమానాలను , 118 హెలికాప్టర్లను నేలకూల్చినట్లు వెల్లడించింది. 476 యుద్ధ ట్యాంకులను, 1487 ఆర్ముడ్ వెహికిల్స్ ను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. 44 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వార్ ఫేర్ సిస్టమ్స్ ను ఉక్రెయిన్ ఆర్మీ నాశనం చేసింది. అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు ఇస్తున్న సైనిక సహాయంతో రష్యాను దెబ్బతిస్తోంది ఉక్రెయిన్ దళాలు.

ఇదిలా ఉంటే రోజులు గడుస్తున్నా కొద్ది ఉక్రెయిన్ లొంగకపోవడంతో రష్యాలో అసహనం పెరుగుతోంది. వరసగా ఉక్రెయిన్ నగరాలపై దాడులు చేస్తోంది. హైపర్ సోనిక్ క్షిపణులతో ఎటాక్ చేస్తోంది. ముఖ్యంగా ప్రధాన నగరాలైన కీవ్, ఖార్కీవ్, మరియోపోల్, ఎల్వీవ్ వంటి నగరాలు మసిదిబ్బలుగా మారుతున్నాయి. రష్యా దాడుల్లో సాధారణ పౌరులు మరణిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version