నేటి నుంచి రైతు బంధు నిధులు జమ..ఈ సారి 5 లక్షల మందికి కొత్తగా రైతుబంధు

-

ఇవాళ్టి నుంచే రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ అవుతాయని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. గజ్వెల్ రైల్వే స్టేషన్ లో ఎరువుల రేక్‌ పాయింట్‌ను ప్రారంభించారు మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…నేటి నుంచి నిధుల పంపిణీ ప్రారంభం అవుతుందని.. 68.10 లక్షల మందికి రూ.7,521 కోట్లు జమచేయనున్నట్లు చెప్పారు. ఈ సారి 5లక్షల మందికి కొత్తగా రైతుబంధు ఇస్తున్నామని ప్రకటించారు. కొత్త వారి చేరికతో రూ.110 కోట్ల అదనపు భారం పడుతుందని స్పష్టం చేశారు. ర్యాక్ పాయింట్ ఉమ్మడి మెదక్ జిల్లాకు దశాబ్దాల పోరాటమని…కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే లైన్ కోసం పోరాడాడని పేర్కొన్నారు.

రైల్వే లైన్ కేంద్రం బాధ్యత.. కానీ నేడు రైల్ రావడానికి కేంద్రం నిధులు తక్కువ, రాష్ట్ర నిధులు ఎక్కువ అని తెలిపారు. నాటి ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య లు నిధులు ఇచ్చేవారు కాదు…రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామంటే, యాడికెళి ఇస్తావ్ అని నాటి కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నాడు. ఈ రోజు అది నిజం అయిందని తెలిపారు.పక్క రాష్ట్రాల్లో మీటర్లు పెట్టి నిధులు తెచ్చుకున్నారని వెల్లడించారు. మనము బాగవుతుంటే, అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక నిధులు అపుతున్నారు. గతంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా జై జవాన్, జై కిసాన్ అనే వారు.. నేడు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం నై జవాన్, నై కిసాన్ అంటున్నదనీ…మొన్న నల్ల చట్టాలు తెచ్చి రైతుల ప్రాణాలు తీస్తే, నేడు ఆర్మీలో కాంట్రాక్ట్ సిస్టమ్ తెచ్చి యువకుల ఉసురు తీస్తున్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version