బీఆర్ఎస్ పాలనలో రియల్ ఎస్టేట్, కొండలు, గుట్టలకు రైతుబంధు ఇచ్చారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయదు అని తెలిపారు. ఇప్పటివరకు 68 లక్షల మంది రైతులకు ₹7,625 కోట్లు ఇచ్చాం. అటు ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతాం అని ధీమా వ్యక్తం చేశారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న ఛాలెంజ్కు హరీశ్రవు కట్టుబడి ఉండాలి. తన ఉనికిని కాపాడుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు’ అని వేములవాడ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కాగా, సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్‌ది తొండి రాజకీయం అని,ఆగస్టు 15వ తేదీలోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి.. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మళ్లీ తాను ఎన్నికల్లో పోటీ చేయనని.. తనకు పదవులు ముఖ్యం కాదని ,’రైతు రుణమాఫీ, ఇచ్చిన హామీలు చేయకపోతే నువ్వు నీ సీఎం పదవికి రాజీనామా చేస్తావా..?’ అని సవాల్ విసిరారు.