తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతన్నలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాల్టి నుంచి అకౌంట్లో నగదు జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి విడతల వారీగా రైతు భరోసా అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయబోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
మొదటి దశలో భాగంగా ఎకరాకు 6000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో… డబ్బులు పడబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటిన్నర ఎకరాలకు రైతు భరోసా నిధులు.. విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇందులోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులు కూడా ఉండే ఛాన్స్ ఉంది.