Rythu Bima Scheme: తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్. రైతు బీమా పథకం పై కీలక ప్రకటన చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతు బీమా దరఖాస్తులను తీసుకునేందుకు ముందుకు వచ్చింది. ఎవరైతే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేదు వారు మళ్లీ చేసుకోవాలని… కోరింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రైతు బీమా పథకానికి అర్హులైన రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తుంది.
ఇప్పటి వరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని వారు ఆగస్టు 5వ తేదీ లోపు అప్లై చేసుకోవాలని కోరింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 18 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్నవారు ఏఈఓ లకు అప్లికేషన్లు ఇవ్వాలని కోరింది. రైతులు పట్టాదారు పాసుపుస్తకం లేదా డిజిటల్ సంతకం చేసిన డిఎస్ పేపర్, ఆధార్ నామిని ఆధార్ కార్డు జత చేయాలి. జూన్ 28వ తేదీ వరకు పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన వారు అర్హులేనని వ్యవసాయ శాఖ.. ప్రకటించింది.