రాష్ట్రంలో అన్నదాతలు మరోసారి అగ్రహించారు. ప్రస్తుతం తెలంగాణలో పత్తి కొనుగోళ్లు జరుగుతుండగా.. మద్దతు ధర విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే అన్నదాతలు కాంగ్రెస్ సర్కారుపై కన్నెర్ర చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం వనపర్తిలో బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నాను నిర్వహిస్తోంది.పత్తి కొనుగోళ్లు సరిగా జరగడం లేదని, తేమ పేరుతో అధికారులు అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే అన్నదాతల పక్షాన కోట్లాడేందుకు, రేవంత్ రెడ్డి సర్కారు తీరును ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ చలో వనపర్తికి పిలుపునిచ్చింది. అక్కడ రైతుల పక్షాన ధర్నా నిర్వహించనున్నారు. దీంతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు హైదరాబాద్ నుంచి వనపర్తికి బై రోడ్ బయలు దేరారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం మాజీ మంత్రి వెంట ఉన్నారు.