బరువు పెరగాడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.. అలాగే తగ్గించుకోవడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎవరికి నచ్చింది వారు ఎంచుకుని ఫాలో అయితే చాలు.. రిజల్ట్ మీకే కనిపిస్తుంది. కష్టపడే కాదు.. ఫుడ్ విషయంలో కాస్త శ్రద్ధ పెట్టి కూడా బరువు తగ్గించుకోవచ్చు. కొంతమంది బరువు తగ్గాలని అదేపనిగా సీ ఫుడ్స్ తింటారు. అవును సీ ఫుడ్స్ ద్వారా కూడా బరువు తగ్గించుకోవచ్చు. అయితే ఈ తప్పులు చేస్తే మాత్రం మీ లక్ష్యం నీరుగారినట్లే..! ఇంతకీ ఆ తప్పులేంటంటే..
సీ ఫుడ్‌లో పోషకాలు ఎక్కువ.. కేలరీలు తక్కువ. చేపలు, షెల్ఫిష్, స్కాలోప్స్ మత్స్య ఆహారాలు చాలా ఆరోగ్యకరమైనవని, బరువును తగ్గిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. చేపలు లీన్ ప్రోటీన్ యొక్క గొప్ప మూలం, ఇది ఆహారానికి మంచి రుచిని ఇస్తుంది. పొట్టను ఎక్కువ సమయం నిండుగా ఉంచుతుంది. సాల్మన్, ట్రౌట్ లేదా ట్యూనా వంటి కొవ్వు చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇతర లీన్ మాంసం కంటే చేపలు ఇతర సీఫుడ్ ఎంచుకోవడం ద్వారా, కొవ్వు తీసుకోవడాన్ని గణనీయంగా తగ్గించవచ్చట. తక్కువ కేలరీలను కలిగి ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
అయితే బరువు తగ్గడం కోసం సీఫుడ్‌ను వండే సమయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. వెన్నను ఎక్కువ మొత్తంలో సీ ఫుడ్ వండే సమయంలో వినియోగించటం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి.. వెన్నకు బదులుగా పచ్చి ఆలివ్ నూనెను ఉపయోగించటం, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, సిట్రస్ వంటి ఫ్లేవర్ బూస్టర్‌లను జోడించటం ఉత్తమం.
అవును.. వేయించిన ఆహారాలు చాలా రుచిగా ఉంటాయి, అయితే బరువు తగ్గించుకోవాలని చేప లేదా మరేదైనా సీఫుడ్‌ను నూనెలో వేయించుకుని తినటం మాత్రం చేయకండి. ఇలా చేయటం అన్నది మీ ఫిట్‌నెస్‌ను దెబ్బతీస్తుంది. సముద్రపు ఆహారాన్ని తీసుకోవాలనుకుంటే బేకింగ్, బ్రేజింగ్, గ్రిల్లింగ్‌ను వంటి పద్దతుల్లో చేయడం మంచిది.
సాల్మన్, ట్యూనా, మాకేరెల్ ,హెర్రింగ్ వంటి కొవ్వు చేపలలో కొంత మొత్తంలో కేలరీలు ఉన్నప్పటికీ, చాలా మంది దీనిని ఉత్తమైన ఆహారంగానే చెప్తారు. నిపుణులు కూడా ఇవి బరువు తగ్గడానికి ఉపయోగపడతాయని అంటారు. కొవ్వు చేపలలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ సంతృప్తిని మెరుగుపరుస్తుంది.. ఇంకా ఇవి గుండె ఆరోగ్యానికి కూడా చాలు మేలు చేస్తాయి.
కాబట్టి.. సీ ఫుడ్స్ ద్వారా బరువు తగ్గొచ్చు.. అయితే వాటిని ఫ్రైలు చేయకుండా.. పైన చెప్పిన పద్ధతులు పాటిస్తే.. టేస్టీ ఆహారం తింటూనే బరువు కూడా తగ్గొచ్చు.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.