రేపు ఓపెన్ కానున్న శబరిమల ఆలయం.. వెళ్లాలంటే ఇవి తప్పనిసరి !

-

కేరళలోని శబరిమల కనుమల్లో నెలకొన్న అయ్యప్ప ఆలయం రెండు నెలల సుదీర్ఘ యాత్ర కోసం ఈ రోజు సాయంత్రం తెరుచుకుంది. ఈరోజు కొత్త ప్రధాన పూజారి బాధ్యతలు స్వీకరించారు, అయితే యాత్రికులను మాత్రం రేపు ఉదయం నుంచి దర్శనానికి అనుమతిస్తారు. అయితే కోవిడ్ -19ని దృష్టిలో పెట్టుకుని యాత్రికులకు అనేక ఆంక్షలు విధించింది కేరళ ప్రభుత్వం. ఒక రోజుకి 1000 మంది యాత్రికులను దర్శనానికి అనుమతిస్తారు. అయితే వెళ్ళే వాళ్ళు అందరూ కోవిడ్ -19 నెగిటివ్ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. అంతే కాక ఇది పంబాలోని బేస్ క్యాంప్‌కు చేరుకోవడానికి 24 గంటలకు మించకుండా ఉండాల్సి ఉంటుంది. పంబా నుండి ఆలయానికి వెళ్లే మార్గంలో యాంటిజెన్ పరీక్షలు నిర్వహించడానికి ఆరోగ్య శాఖ అనేక కియోస్క్‌లను తెరిచినట్లు ఆలయాన్ని నిర్వహిస్తున్న ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టిడిబి) తెలిపింది.

యాత్రికులను కొండపై ఉండటానికి మరియు పవిత్ర నది పంబాలో స్నానం చేయడానికి కూడా అనుమతించరని టిడిబి అధికారులు తెలిపారు. అయితే కొండ ట్రెక్కింగ్‌ చేసేప్పుడు మాస్క్ లు తప్పనిసరి కాదు. ఎందుకంటే నిటారుగా ఉన్న ఆ కొండను ట్రెక్కింగ్ చేసేటప్పుడు మాస్క్ లు ఉంటే భక్తులకు శ్వాస సమస్యలను సృష్టిస్తాయని గతంలో వైద్యులు హెచ్చరించారు. అయితే, ట్రెక్కింగ్ సమయంలో భక్తులు కఠినమైన సామాజిక దూరాన్ని కొనసాగించాలని కోరారు ఇక కఠినమైన ఆంక్షలతో నెలవారీ పూజల కోసం గత నెలలో ఈ ఆలయం ఓపెన్ చేశారు. కాని భక్తులు చాలా తక్కువగా హాజరయ్యారు. రోజుకు 250 మంది యాత్రికులను అనుమతించిన ప్పటికీ, వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది, ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించే భక్తుల సంఖ్యని పెంచమని బోర్డు ప్రభుత్వాన్ని బలవంతం చేసింది. ఇప్పుడు వార్షిక తీర్థయాత్ర కోసం 1000 మంది యాత్రికులుని అనుమతించడానికి ప్రభుత్వం అంగీకరించింది.   

 

Read more RELATED
Recommended to you

Exit mobile version