ఎన్నికల స్టంట్.. రాయితీలు, వేతనాలు, దిద్దుబాటు చర్యలు

-

తెలంగాణలో టీఆర్‌ఆర్‌ ప్రభుత్వం ఇటీవలె చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది..నిన్న రాష్ట్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణాయలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం..వెంటనే తన ప్రణాళికలను అమలు చేస్తుంది..ఈ రోజు ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్శదర్శి సోమేష్‌కుమార్‌ భేటీ ఆయిన మంత్రులు తలసాని, కేటీఆర్‌ ఇటీవలె హైదరాబాద్‌లో వచ్చిన వరదలు,నష్ట నివారణ చర్యలలో దొర్లిన పొరపాట్లును సరిదిద్దుకునే ప్రయత్నం మొదలు పెట్టారు.

వచ్చే నెలలో గ్రేటర్‌ ఎన్నికలు వస్తుండటంతో నగరపాలనపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది ప్రభుత్వం..అందులో బాగంగానే గ్రేటర్‌,పట్టణ వాసులకు దీపావళి పండుగ కానుక అంటూ తాయిలాలను ప్రకటించింది..హైదరాబాద్‌లో ఓటర్లను మళ్లీ తమవైపు తిప్పుకోవడానిక నానాపాట్లు పడుతున్నారు మంత్రులు..తాజాగా గ్రేటర్‌లో ఉన్న ఓట్లను ఆకర్శించడానికి ఆస్తిపన్నులో 50 శాతం రాయితీలు ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు..దీంతో ప్రభుత్వంపై వందల కోట్ల భారం పడుతుందని..అయినా గ్రేటర్ ప్రజలు సంతోషం ఈ నిర్ణయం తీసుకున్నామని మీడియా సమావేశంలో ప్రకటించారు..ఇప్పటికే టాక్సి కట్టినట్లతై వచ్చే ఏడాయి ఆ 50 శాతం రాయిని పొందవచ్చని ప్రకటించారు..

ఆస్తి పన్నులో రాయితీ ఇవ్వడంపై కొంతమంది సంతోషం వ్యక్తం చేసిన..చాలా మంది దీన్ని ఎన్నికల స్టంట్‌గా అభివర్ణిస్తున్నారు..ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న రాయితీ పెద్దగా ఉపయోగం లేదని అభిప్రాయపడుతున్నారు.. ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్‌ఎస్‌, రెగ్యులేషన్‌ ఖర్చులతో పోల్చుకుంటే ప్రభుత్వం వారి దగ్గరి నుంచి ఫీజుల రూపంలో తీసుకున్న దానికంటే పెద్దగా ఇచ్చేది ఏమీలేదని విమర్శిస్తున్నారు ప్రతి పక్ష నేతలు.. ఇది కేవలం ఎన్నికల కోసమే కేసీఆర్‌ ఆడుతున్న నాటకమని దుయ్యబడుతున్నారు..రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదుకాని.. హైదరాబాద్‌లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇలాంటి రాయితీ పథకాలతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఎద్దేవేశారు..

మరోవైపు గ్రేటర్‌లో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి మున్సిపల్ ఉద్యోగులు పని చేస్తూనే ఉన్నారు..వైద్య సిబ్బంది ఆస్పత్రిలో సేవలు అందిస్తుంటే..కరోనా వ్యాప్తి చెందకుండా నగరాన్ని శుభ్రంగా ఉంచారు మున్సిపల్ కార్మికులు..మొదల్లో వారికి ప్రోత్సాహకాలు ఇచ్చినప్పటికి దాన్ని మధ్యలోనే అపేశారు..ఇప్పతు మళ్ళీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కార్మికుల వెతనాలను తెరపైకి తెచ్చారంటున్నారు విశ్లేషకులు..మున్సిపల్ కార్మికులపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే అప్పుడే వేతనాలు పెంచెవారని… ప్రోత్సహాకాలను మధ్యలోనే అపేవారు కాదని ప్రభుత్వంపై విమర్శిస్తున్నారు..

గ్రేటర్‌లో మున్సిపల్ ఉద్యోగుల ఓట్లు కీలకంగా మారనున్నాయి..అభ్యర్థుల జీవితాలను మార్చే స్థాయిలో వారి ఓటు శాతం ఉంది..వారు తలుచుకుంటే వారి ఓట్లతో అభ్యర్థుల భవిష్యత్ మార్చగలరు..అందుకే గత కొంత కాలంగా జీతాల పెంపు విషయంలో మున్సిపల్ ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించడానికి ఎన్నికల తాయిలలను ప్రకటించారని అంటున్నారు విశ్లేషకులు..ఇప్పటికై ఎన్నికల నేఫథ్యంలో అయినా జీతాలను పెంచినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్‌ ఉద్యోగులు..మరి మిగతా పట్టణాల్లో ఉన్న ఉద్యోగుల గురించి ఎందుకు ఆలోచించలేదని.. వారు కూడా కరోనా సమయంలో కష్టపడ్డారు..గ్రామీణ ప్రాంతంలో ఉన్న కార్మికులుకు జీతాలు ఎందుకు పెంచడంలేదని కూడా రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు..

గ్రేటర్‌లో వరద సాయం విషయంలో అలస్యం, బంధుప్రీకి కనిపించిందని మంత్రి గారి మాట్లల్లో అర్థం అవుంది..ఈ విషయంలో ప్రభుత్వం విఫలం చెందినట్లు పరోక్షంగా ప్రభుత్వం అంగీకరించినట్లే..ఇప్పటికి వరకూ నాలుగు లక్షలకు పై బాధితులకు దాదాపు రూ.450 కోట్ల సాయం అందించినట్లుప్రకటించారు..అదే సమయంలో ఇంక అందని వారు ఉంటే వారి కోసం మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.. అంటే వరదసాయం అందించడంలో ప్రభుత్వం వైఫల్యం ఉన్నట్లే కదా అని ప్రతి ప్రతి పక్షాలు విమర్శిస్తున్నారు..గ్రేటర్లో వదర వల్ల ఎక్కువ నష్టపోయింది అద్దెకు ఉంటున్నవారు మాతమ్రే..కిరాయికి ఉన్నవారికి కాకుండా ఇంటి యజమానులకు సాయం అందించడంపై క్లారీటీ ఇవ్వలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి..గ్రెటర్‌లో ఆస్తి పన్నులో రాయితీ ఇచ్చే బదులు ఎల్ఆర్‌,బీఆర్‌ఎస్‌ వంటివి ప్రభుత్వం ఉచితంగా చేస్తే బాగుంటుందిని సలహ ఇస్తున్నాయి ప్రతి పక్షాలు..

Read more RELATED
Recommended to you

Exit mobile version