బీఆర్ఎస్ ని ఎదుర్కొనే సత్తా బీజేపీ కి లేదు: సబితా ఇంద్రారెడ్డి

-

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా బిజెపి కాంగ్రెస్ పార్టీ లకి లేదని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుని ఖండిస్తూ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపుతోనే ఎమ్మెల్సీ కవితని అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు.

అరెస్టులు ఉద్యమాలు కేసీఆర్ కుటుంబం కి కొత్త కాదని అన్నారు. కుట్ర పూర్వకంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ఎన్నికలు రాగానే ప్రతిపక్ష పార్టీల నాయకుల పై ఈడీ, ఐటీ దాడులు చేస్తుందని అన్నారు కవితకి అండగా మహిళలంతా నిలబడాలని అన్నారు న్యాయపదంగా కోర్టులో పోరాడుతామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version