టీమిండియాలోకి సచిన్ రీఎంట్రీ.. కీలక పదవి చేపట్టనున్న లిటిల్ మాస్టర్!

-

టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కు బంపర్‌ ఆఫర్‌ తగిలింది. టీమిండియా క్రికెట్‌ బోర్డులో కీలక పదవిని సచిన టెండూల్కర్‌ కు అప్పగించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తుంది. బీబీసీఐ సెక్రటర జై షా ఈ పనిపైనే పూర్తిగా దృష్టి సారించారు. అతి తర్వలోనే.. భారత క్రికెట్‌ కు సచిన్‌ టెండూల్కర్‌ సేవలను వాడుకోవాలని… బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. జైషా.. ఈ విషయంపై సచిన్‌ తో కూడా సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం.

16 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ క్రికెట్‌ లోకి అడుగు పెట్టి తనదైన బ్యాటింగ్‌ తో ప్రపంచ వ్యాప్తంంగా అభిమానులను సంపాదించుకున్నాడు ఈ లిటిల్‌ మాస్టర్‌. అత్యధిక మ్యాచ్‌ లు, పరుగులు, సెంచరీలు, హాఫ్‌ సెంచరీలు ఇలా ఎన్నో మైలు రాళ్లను అందుకున్నారు సచిన టెండూల్కర్‌. అలాంటి సచిన్‌ సేవలను భారత జట్టుకు వాడుకోవాలని బోర్డు భావిస్తున్న క్రమంలోనే జైషా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై సచిన్‌ తో సంప్రదింపులు కూడా జరిగాయట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news