చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను ఖండించిన SAD చీఫ్ !

-

అవినీతి కేసులో ఆంధ్రప్రదేశ్ సీనియర్ రాజకీయ నాయకుడు మరియు టీడీపీ అధినేత చంరబాబు నాయుడును సిఐడి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ అరెస్ట్ పై ఇప్పటికే చాలా మంది రాజకీయ నేతలు స్పందించి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. తాజాగా శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు షుఖ్ భీర్ సింగ్ బాదల్ చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. ప్రస్తుతం మాజీ సీఎం చంద్రబాబు ఈ పరిస్థితుల్లో ఉన్నారంటే చాలా బాధాకరం అంటూ ఎమోషన్ కామెంట్ చేశారు బాదల్. ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపశిల్పి చంద్రబాబు ను బూటకపు ఆరోపణలతో అరెస్ట్ చేసినట్లు ఈయన బాదల్ తెలియచేయడం జరిగింది. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా బాదల్ ఈ అరెస్ట్ లో ప్రజాస్వామ్యంగా ప్రవర్తించినట్లు ఏమీ అనిపించలేదని ఖండించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నేను ఖండిస్తున్నాను.. మీరందరూ కూడా ఈ అరెస్ట్ ను వ్యతిరేకించాలి అంటూ బాదల్ పోస్ట్ చేశారు.

మరి ఈ పోస్ట్ పై ఏపీ నుండి ఎవరైనా స్పందిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ రోజు చంద్రబాబుకు హౌస్ రిమాండ్ కావాలని పిటిషన్ వేసినా కోర్ట్ దీన్ని తిరస్కరించింది.

Read more RELATED
Recommended to you

Latest news