పాపం.. పెళ్ళికి వెళ్లి బుక్ అయిపోయారు…!

-

లాక్ డౌన్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ స్థాయిలో సీరియస్ గా ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే. లాక్ డౌన్ విషయంలో ఏ మాత్రం కూడా సహించడం లేదు. ఇక పెళ్ళిళ్ళు చాలా మంది ఈ లాక్ డౌన్ లో వాయిదా వేసుకుంటున్నారు దాదాపుగా. ఎవరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నా సరే చాలా వరకు జాగ్రత్తగా వివాహాలను ఎవరూ కూడా లేకుండానే చేసుకునే పరిస్థితి అనేది ఉంది అనే చెప్పాలి.

అయితే తాజాగా ఒక జంట ఇలాంటి వివాహం చేసుకుని చిక్కుల్లో పడింది. మహారాష్ట్రలో జరిగింది ఈ ఘటన. మహారాష్ట్ర పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే… మహారాష్ట్ర రాయ్‌గఢ్‌ జిల్లా కర్జాత్‌లోని ముద్రే తహసీల్‌ ప్రాంతానికి చెందిన ఓ జంట గత ఆదివారం వివాహం చేసుకుంది. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం చాలా వరకు జాగ్రత్తగా ఈ వివాహం చేసుకోవాలి. ముందుగా రెవెన్యు శాఖ అనుమతి అవసరం.

రెవెన్యు శాఖ అనుమతి ప్రకారం చూస్తే… 50 మంది మాత్రమే హాజరుకావాల్సి ఉంది. కాని 150 మందిని ఆహ్వానించారు నిర్వాహకులు. కర్జాత్‌కు చెందిన సామాజిక కార్యకర్త హృషికేషి జోషి పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనితో పెళ్లి చేసిన చేసుకున్న వచ్చిన అందరి మీద కేసులు పెట్టారు. పెళ్ళికి వచ్చిన వారు అయితే వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అంటూ కామెంట్స్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version