మన టాలీవుడ్ హీరోలు ఓటీటీ వైపు చూడరా .. అని అనిపిస్తుంది. కోలీవుడ్, బాలీవుడ్ లో అమితాన్ బచ్చన్..అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు తమ సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. కోలీవుడ్ లో కూడా అందుకు రెడీ అవుతున్నారు. కాని టాలీవుడ్ లో మాత్రం మన హీరోలు తమ సినిమాలని థియోటర్స్ లోనే రిలీజ్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.
వాస్తవంగా అయితే గడిచిన ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు చూస్తే చాలా సినిమాలు రిలీజ్ కావాల్సింది. వందల కోట్ల బిజినెస్ జరగాల్సింది. నాని నటించిన వి సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలని కంప్లీట్ చేసుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించగా నివేదా థామస్, సుధీర్ బాబు, అదితీ రావు హైదరీ ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇక ఇదే నెలలో అనుష్క నటించిన నిశబ్ధం కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. మాధవన్, అంజలి, షాలిని పాండే నటించిన ఈ సినిమాని కోన వెంకట్ నిర్మించగా హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. నిశబ్ధం పాన్ ఇండియా ఈ సినిమా రూపొందింది. అలాగే రాం పోతినేని కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తయారై రిలీజ్ కి రెడీగా ఉంది రెడ్ సినిమా. ఈ సినిమాలో రాం డ్యూయల్ రోల్ లో నటించాడు. ఈ సినిమాలన్ని రిలీజ్ కాకుండా అలాగే ఉన్నాయి.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ కూడా మే 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనుకున్నారు దిల్ రాజు..బోనీ కపూర్. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి వేణు శ్రీరాం దర్శకత్వం వహించగా నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి ప్రధాన పాత్రల్లో నటించారు. కాని ఈ సినిమాకి ఇంకా నెల రోజుల వర్క్ పెండింగ్ ఉంది.
మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాని రిలీజ్ చేయాలనుకున్నప్పటికి మేకర్స్ థియోటర్స్ ఓపెన్ అయ్యాకే రిలీజ్ చేద్దామని వేయిట్ చేస్తున్నారు. అలాగే రానా దగ్గుబాటి నటంచిన అరణ్య సినిమా కూడా ఎటువంటి పరిస్థితుల్లో థియోటర్స్ లోనే రిలీజ్ చేస్తాము తప్ప ఓటీటీలో కాదు అంటూ గట్టిగా కూర్చున్నారట. మరి ఇలా అయితే ఆర్ధికంగా ఇంకా కష్టాలు తప్పవేమో అంటున్నారు సినీ విశ్లేషకులు.