పాపం ఒక రికార్డ్ సాధించి మరో రికార్డ్ ముందు అవుటైన రోహిత్…!

-

టీం ఇండియా వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో మోడరన్ డే గ్రేట్స్ లో ఒకడిగా నిలుస్తున్న రోహిత్ శర్మ ఈ మధ్య మరింత దూకుడు పెంచి ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన ఆట తీరుతో పలు రికార్డులను సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా మరో రికార్డ్ ని రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు.

వన్డేల్లో 7 వేల పరుగులు సాధించి రికార్డ్ నెలకొల్పాడు. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో 7000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఓపనర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. కేవలం 137 ఇన్నింగ్స్‌లో హిట్ మ్యాన్ ఈ మైలురాయిని చేరుకొని, 147 ఇన్నింగ్స్ ల హషీం ఆమ్లా రికార్డ్ ని అధిగమించాడు. 7000 పరుగుల క్లబ్‌లో చేరిన నాలుగో భారత ఓపనర్ రోహిత్ శర్మ. సచిన్ టెండుల్కర్,

సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌లు రోహిత్ ముందు ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే రోహిత్ మరో నాలుగు పరుగులు చేస్తే, 9 వేల పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచేవాడు. 42 పరుగులు చేసి అవుట్ కావడంతో ఆ రికార్డ్ మిస్ అయ్యాడు హిట్ మ్యాన్. ఇదిలా ఉంటే శుక్రవారం జరిగిన రెండో వన్డేలో టీం ఇండియా 36 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తూ చేసింది. రెండో వన్డే రేపు జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version