తెలుగులో ఒక హీరోయిన్ అడుగుపెట్టాలి అంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలా కష్టం. ఈ విషయం అందరికి తెలుసు. సినిమా హిట్ అయితే ఏమీ లేదు గాని ఫ్లాప్ అయితే మాత్రం ఆ హీరోయిన్ కి ఫిల్టర్ కాఫీ కూడా ఇచ్చే దిక్కు ఉండదు. కనీసం లైట్ బాయ్ కూడా ఆమెను లెక్క చేసే పరిస్థితి తెలుగు సిని పరిశ్రమలో ఉండదు. అంత వరకు అలా ఉంటే, కొంత మంది హీరోయిన్లు తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నా,
మెయిన్ హీరోయిన్ మాత్రం కాలేక అవస్థలు పడుతున్నారు. ప్రణీత, నిత్యామీనన్, రాయ్ లక్ష్మీ, ఈశా రెబ్బా ఇలా కొంత మంది తెలుగులో మెయిన్ హీరోయిన్ మాత్రం కాలేకపోతున్నారు. హీరోయిన్ ఫ్రెండ్ గా నటించడమో, విలన్ కి చెల్లిగా నటించడమో లేదా ఏదైనా ఐటెం సాంగ్ లో కనపడటమో గాని ఎక్కడా కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోలేకపోతున్నారు.
నిత్యామీనన్ హీరోయిన్ గా మెప్పించినా ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదు. ప్రణీత సెకండ్ హీరోయిన్ అవుతుంది గాని మెయిన్ హీరోయిన్ కాలేకపోతుంది. రాయ్ లక్ష్మీ కేవలం ఐటెం సాంగ్స్ కి పరిమితం అవుతుంది. ఈశా రెబ్బా అయితే ఎక్కడో చిన్న సినిమాలో మినహా కనపడటం లేదు. ఈ జాబితాలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. మరి వీళ్ళకు తెలుగు సినిమా మోక్షం ఎప్పుడు లభిస్తుందో చూడాలి.