నిలకడగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం..!

మెగా స్టార్ మేనల్లుడు, యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. స్పోర్ట్స్ బైక్ పై బంజారాహిల్స్ రోడ్ నంబర్ 45 నుండి గచ్చిబౌలి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో వెళ్ళడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ బైక్ స్కిడ్ అవ్వడం వల్ల కిందపడిపోయినట్టు తెలుస్తోంది.

కేబుల్ బ్రిడ్జ్ ప్రమాదం జరగటం తో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. సాయి ధరమ్ తేజ్ కు ఛాతి, కడుపు, నుదుటి భాగం లో గాయాలయ్యాయి. పోలీసులు సాయి దరం తేజ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం తో ఆస్పత్రికి చేరుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు.