బిగ్ బాస్: నోర్మూసుకో.. ఉమాపై ప్రియాంక రచ్చ..హౌస్ లో మొదలైన గ్రూపులు

బిగ్ బాస్ హౌస్ లో వినాయక చవితి సంబరాలు బాగా జరిగాయి. సాంప్రదాయ వస్త్రధారణలో కంటెస్టెంట్లు అందరూ వినాయక పూజలో పాల్గొన్నారు. ఐతే పండగ సంబరం జరుపుకున్న కొద్దిసేపటి తర్వాత హౌస్లో పెద్ద రచ్చ జరిగింది. హౌస్ లో ఇప్పటి వరకు బెస్ట్ పర్ఫార్మర్, వరస్ట్ పర్ఫార్మర్ ఎవరనేది ఒక్కొక్కళ్ళుగా చెప్పాలని బిగ్ బాస్ తెలిపాడు. దాంతో ఒక్కొక్కరుగా లేచి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమయంలో ఉమాదేవి గారికి ప్రియాంకకు మధ్య పెద్ద గొడవ జరిగింది.

ఉమాగారిని వరస్ట్ పర్ఫార్మర్ గా చెప్పిన ప్రియాంక, ప్రతీ దానికీ అరుస్తున్నారని, అందరినీ చులకనగా చూస్తున్నారని, మీ చూపు నాకు నచ్చట్లేదని, మిమ్మల్ని అక్కా అంటున్నానని, కానీ మీరు చిన్నచూపు చూస్తున్నారని తెలిపింది. అపుడు ఉమాగారు నన్ను పేరుతోనే పిలువు. అక్కా అనాల్సిన అవసరం లేదంటే, నన్ను మా తల్లిదండ్రులు అలా పెంచలేదని, ఉమాగారిపై పర్సనల్ అటాక్ చేసింది. అది చిలికి చిలికి పెద్ద గాలివానలా మారి గొడవని మరింత ఎక్కువ చేసింది.

దాంతో షటప్ నోర్మూసుకో అంటూ ప్రియాంక, ఉమాపై అరిచింది. ఆ తర్వాత షటప్ అన్నదానికి బాధపడినప్పటికీ అప్పటికే బెస్ట్ అనిపించుకున్న కొంతమందిలో ప్రియాంకపై నెగెటివిటీ వచ్చేలా చేసింది. ఇదిలా ఉంటే హౌస్ లో గ్రూపులు మొదలవుతున్నాయా అని సిరి మాట్లాడింది. షణ్ముఖ్ తో మాట్లాడిన ఈ మాటలు చూస్తుంటే, భవిష్యత్తులో వీరిద్దరు, కాజల్ కలిసి ఒక గ్రూపు తయారయ్యేలా ఉంది. మొత్తానికి బెస్ట్, వరస్ట్ పేరుతో హౌస్ మేట్స్ మధ్య పెద్ద చిచ్చే పెట్టాడు.