క్రేజీ మల్టీస్టారర్లో హీరోయిన్లుగా సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ మల్టీస్టారర్లు రూపుదిద్దుకుంటున్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కుతుంటే, మరో పక్క మరో క్రేజీ మల్టీస్టారర్ కి పునాదులు ఇటీవలే పడ్డాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. లాంచింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి తాజాగా అప్డేట్ బయటకి వచ్చింది. ఇద్దరు క్రేజీ హీరోలు ఒకరినొకరు ఎదురుపడనున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది.

పవన్ సరసన సాయిపల్లవి హీరోయిన్ గా కనిపిస్తుందట. అటు రానా పక్కన ఐశ్వర్య రాజేష్ నటిస్తుందట. వరల్డ్ ఫేమస్ లవర్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్యకి తెలుగులీ ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుతున్నాయి. ఐతే ఇందులో ప్రేమ ప్రసక్తి ఉండదు. ఇద్దరు వ్యక్తుల అహం ఏ పరిస్థితులకి దారి తీసిందన్నదే కథ. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version