బయోపిక్ లో సాయి పల్లవి.. ఎవరిదో తెలుసా..?

-

ఫిదా సినిమా తో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తనదైన నటనతో చిలిపి నవ్వుతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి అందరినీ కట్టిపడేసింది సాయిపల్లవి. ఇక తన నటనతో కూడా ఎంతో మందిని ఆకర్షించింది. అయితే సాయి పల్లవి ఏ పాత్రలో నటించిన పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే సాయిపల్లవి త్వరలో ఓ బయోపిక్లో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అలనాటి తార సౌందర్య బయోపిక్ లు సాయి పల్లవి నటించబోతున్నట్లు తెలుస్తోంది. సౌందర్య బయోపిక్ తెరకెక్కించాలని చిత్ర బృందం సౌందర్య పాత్రలో సాయిపల్లవి అయితేనే న్యాయం చేయగలదు అని భావించి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీని పై నెటిజన్లు భిన్నంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది సాయిపల్లవి.. నటనతో సౌందర్య పాత్రను అద్భుతంగా పండించ కలదు అని అంటుంటే మరి కొంతమంది వేరే హీరోయిన్ అయితే అయితే బాగుండేదేమో అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం అన్నది చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news