ఒక్కరాత్రిలో అంతా తలక్రిందులైంది.. ఆసక్తిరేపుతున్న ‘గార్గి’ ట్రైలర్‌..

-

గౌతమ్ రామచంద దర్శకత్వంలో సాధారణ కుటుంబ నేపథ్యంలో యువతి పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది సాయిపల్లవి. న్యాయం కోసం పోరాడే యువతి పాత్రలో సాయి పల్లవి నటించిన చిత్రం ‘గార్గి’ . ఈ సినిమా ఈ నెల 15న విడుదల చేసేందకు మేకర్స్‌ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేస్తోంది. నాని, రానాలతో తెలుగు ట్రైలర్‌ను, హీరో సూర్య, ఆర్య, అనిరుధ్, లోకేశ్ కనగరాజ్లతో తమిళ ట్రైలర్‌ను విడుదల చేయించింది చిత్రయూనిట్‌. ట్రైలర్‌ విడుదల చేసిన అనంతరం వారంతా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగే సన్నివేశాలతో ఆసక్తిగా సాగింది. సాధారణ కుటుంబానికి చెందిన యువతి పాత్రలో ఉన్న సాయిపల్లవి ఓ టీచర్‌ కనిపించారు. అయితే ఆమె తండ్రి ఏదో కేసుల అరెస్ట్‌ అవడం సంబంధించిన సన్నివేశాలు ట్రైలర్‌లో చూపించారు. ఆమె తండ్రికోసం ఆమె చేసే న్యాయపోరాటాన్ని ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్‌లో తన నటనతో సాయి పల్లవి ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version