సైఫ్ పై దాడి కేసులో నిందితులను గుర్తించిన పోలీసులు..!

-

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని సైఫ్ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దుండగులు అడ్డుకోవడానికి వచ్చిన సైఫ్ పై కత్తితో దాడి చేసారు. మొత్తం ఆరుసార్లు సైఫ్ ను పొడిచినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ కేసులో విచారణ ప్రారంభించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. నిందితులను గుర్తించారు.

సైఫ్ పక్కింట్లోని సీసీ టీవీ ఫుటేజ్ అలాగే నిందితుల వేలి ముద్రలు.. అదే విధంగా సంఘటన స్థలంలో దొరికిన ఆధారాలతో ఇందులో ఉన్న ఇద్దరు నిందితులను గుర్తించారు పోలీసులు. కానీ ఇంకా వారిని పట్టుకోలేదు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు ముంబై పోలీసులు. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న సైఫ్ ప్రాణాలకు ఏ ప్రమాదం లేదని తెలుస్తుంది. కాకపోతే సైఫ్ వెన్నుముకలో కత్తి విరిగినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news