దీపావళి రోజున ఇదేం వికృతానందం.. బైకర్ స్టంట్స్‌పై సజ్జనార్ ట్వీట్ వైరల్

-

తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్ (ఐపీఎస్) సామాజిక మాద్యమాల్లో చాలా చురుకుగా ఉంటుంటారు. సమాజానికి చేటు చేస్తున్న వ్యక్తులను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తుంటారు. వారికి శిక్షపడే విధంగా పోలీసులను అప్రమత్తం చేయడంతో పాటు రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు నిత్యం అవగాహన కల్పిస్తుంటారు. ఆర్టీసీ ఎండీగా సంస్థను నష్టాల ఊబి నుంచి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నారు.

తాజాగా ఆయన ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. దీపావళి రోజున ఓ బైకర్ హైటెక్ సిటీలో.. తన బైకు హెడ్ లైట్ వద్ద రాకెట్ క్రాకర్స్‌ను తాడుతో కట్టి వాటిని వెలిగించి ప్రమాదకరమైన స్టంట్స్ చేశాడు.ఈ వీడియోను ఆయన పోస్టు చేశారు.‘దీపావళి రోజున ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం.
దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ..అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!?’ అని ఆ బైకర్‌పై మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news